
మాస్క్ ధరించకపోతే వెయ్యి ఫైన్ వేస్తామని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. కరోనా వైరస్ పై నిర్వహించిన మీడియా సమావేశంలో కేసీఆర్.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు వెల్లడించారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ కరోనా వైరస్ ను అరికట్టేందుకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని కోరారు. పలు దఫాలుగా విధించిన లాక్ డౌన్ కు మద్దతు పలికారంటూ ప్రజలపై ప్రశంసల వర్షం కురిపించారు.
ఈ సందర్భంగా కంటైన్ మెంట్ జోన్లలో కాకుండా మిగిలిన ప్రాంతాల్లో సెలూన్ షాపులు, ఆన్ లైన్ డెలివరీ చేసుకోవచ్చన్నారు. బస్ లు రేపటి నుండి నడుస్తాయన్న కేసీఆర్ ..కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రభుత్వ,ప్రయివేట్ సంస్థలు పనిచేస్తాయన్నారు.
వీటితో పాటు అన్ని మతాల దేవాలయాలు, సభలు సమావేశాలు, మాల్స్, సినిమా హాల్స్, విద్యాసంస్థలు, బార్లు, స్టేడియం, పార్కులు, మెట్రో రైలు మూసేసి ఉంటాయని సూచించారు.
ప్రతీ ఒక్కరూ మాస్క్ ధరించాలని, మాస్క్ ధరించకపోతే 1000 రూపాయల ఫైన్ విధిస్తామన్నారు. భౌతిక దూరాన్ని పాటిస్తూ దుకాణాలలో శానిటైజర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. అవసరం లేని వాళ్ళు బయటకి రాకూడదు.తిరగబడితే మళ్ళీ లాక్ డౌన్ కు వెళ్లాల్సి వస్తుందని సీఎం కేసీఆర్ మీడియా సమావేశంలో వెల్లడించారు.