
కుమురంభీం జిల్లా పెంచికల్ పేట మండలం గుండెపల్లిలో పెద్దపులి హాల్ చల్ చేసింది. అర్ధరాత్రి ఓ ఇంటి ఆవరణలో కట్టేసిన పశువుపై దాడి చేసింది. పశువుల అరుపులు విని ఇంటి యజమాని కేకలు వేశాడు. దీంతో సమీపంలోని అడవిలోకి వెళ్లిపోయింది పెద్దపులి. గ్రామంలో పెద్దపులి సంచారంతో భయంతో వణికిపోతున్నారు గ్రామస్తులు. మళ్లీ ఎప్పుడు పెద్దపులి దాడి చేస్తుందోనని ఆందోళనతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అధికారులు వెంటనే పెద్దపులిని పట్టుకొని తమ ప్రాణాలు కాపాడాలని కోరుతున్నారు.