కొమురం భీం జిల్లా నుంచి మహారాష్ట్రలోకి ప్రవేశించిన పెద్దపులి

 కొమురం భీం జిల్లా నుంచి మహారాష్ట్రలోకి ప్రవేశించిన పెద్దపులి

హమ్మయ్యా అక్కడి ప్రజలు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కొమురంభీం జిల్లా వాసులను వణికించిన పెద్దపులి రాష్ట్ర సరిహద్దు దాటి మహారాష్ట్రలోకి ప్రవేశించింది. వారం రోజుల పాటు జనాలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన పెద్ద పులి ప్రాణహిత నదిని దాటి మహారాష్ట్ర లోకి వెళ్ళిపోయినట్టుగా ఫారెస్ట్ అధికారులు  నిర్దారించారు. ఇవాళ చివరగా బెజ్జూర్‌ మండలం నాగేపల్లి శివారులో పులి సంచరించిందని...టైగర్ వెళ్లిపోయినట్టు పాదముద్రలు కనిపిస్తున్నాయని అటవీశాఖ అధికారులు తెలిపారు. 

పులికి సంబంధించిన సమాచారాన్ని  మహారాష్ట్ర లోని అహేరి ఫారెస్ట్ అధికారులకు కొమురం భీం జిల్లా అధికారులు చేరవేశారు. ఈనెల15న వంకిడి మండలం ఖానాపూర్ లో ఓ వ్యక్తిపై దాడి చేసి చంపేసింది. వారం నుండి ప్రతిరోజు సిర్పూర్-టి నియోజకవర్గంలో ఎక్కడో ఒకచోట జనాలకు కనిపించింది పెద్ద పులి. కాగజ్ నగర్ పట్టణంతో పాటు పలు గ్రామాల్లోకి ప్రవేశించి పశువులపై దాడి చేసిది. పులి సరిహద్దు దాటడంతో జిల్లా ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఈనెల 15న మహారాష్ట్ర నుండి కొమురంభీం జిల్లాలో ప్రవేశించిన పెద్దపులి..తిరిగి తన ప్రాంతానికి వెళ్లిపోయింది.