చేవెళ్ల బస్సు ప్రమాదం జరిగిన స్పాట్కు కొద్ది దూరంలోనే.. చెట్టును ఢీకొట్టిన టిప్పర్

చేవెళ్ల బస్సు ప్రమాదం జరిగిన స్పాట్కు కొద్ది దూరంలోనే.. చెట్టును ఢీకొట్టిన టిప్పర్

చేవెళ్ల, వెలుగు: హైదరాబాద్​– బీజాపూర్ హైవేపై మరో ప్రమాదం జరిగింది. ఇటీవల రోడ్డు ప్రమాదం జరిగి 19 మంది చనిపోయిన సంఘటనా స్థలానికి కొద్ది దూరంలోనే టిప్పర్​ చెట్టును ఢీకొట్టింది. స్థానికుల వివరాల ప్రకారం.. హైవే పనుల కోసం గురువారం చేవెళ్ల మండలం అంతారం నుంచి మట్టిని నింపుకొని వస్తున్న టిప్పర్​ ఖానాపూర్ స్టేజీ వద్ద అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్​ వడ్డె శ్రీరామ్​కు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని టిప్పర్​ను జేసీబీ ద్వారా పక్కకు జరిపి.. డ్రైవర్ను చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు.