నాగార్జున వందో సినిమా టైటిల్పై ట్విస్ట్.. కింగ్ కంపల్సరీ

నాగార్జున వందో సినిమా టైటిల్పై ట్విస్ట్.. కింగ్ కంపల్సరీ

డిఫరెంట్ స్క్రిప్ట్ లను సెలెక్ట్ చేసుకుంటూ  కొత్త దర్శకులను ఎంకరేజ్ చేయడంలో హీరో నాగార్జున ముందుంటారు. తాజాగా ఆయన వందో సినిమా సన్నాహాల్లో బిజీగా ఉన్నారు. తన  కెరీర్‌‌‌‌ మైల్ స్టోన్‌‌ మూవీని తమిళ దర్శకుడు  రా.కార్తీక్‌‌ రూపొందిస్తున్నాడు. ఈ  చిత్రానికి మొన్నటి వరకు ‘కింగ్‌‌ 100 నాటౌట్‌‌’ అనే టైటిల్‌‌ ప్రచారంలో ఉంది. తాజాగా ఈ  టైటిల్‌‌లో ట్విస్ట్ ఉందని, ఈ చిత్రానికి  మరో టైటిల్‌‌ను ఫిక్స్ చేశారనే టాక్ వినిపిస్తోంది. ఈ  కథకు లాటరీకు సంబంధం ఉందని అందుకే ‘లాటరీ కింగ్’ అనే పేరును ఫైనల్ చేశారని  సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఏ టైటిల్ ఫిక్స్ చేసినా అందులో కింగ్ మాత్రం కంపల్సరీగా ఉండేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. మరోవైపు ఈ సినిమాను దసరా సందర్భంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించినట్టు తెలుస్తోంది. యాక్షన్‌‌తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్‌‌తో ఈ సినిమా తెరకెక్కనుందని, ఇందులో నాగ్‌‌తోపాటు నాగచైతన్య, అఖిల్ కూడా కీలక పాత్రలు పోషించబోతున్నారని  ప్రచారం జరుగుతోంది. అలాగే ముగ్గురు హీరోయిన్స్ నటించబోతున్నారని తెలుస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌‌‌‌పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది.