పట్టు బిగిస్తున్న భారత్ : కోహ్లీ, అశ్విన్‎ హాఫ్ సెంచరీలు

పట్టు బిగిస్తున్న భారత్ : కోహ్లీ, అశ్విన్‎ హాఫ్ సెంచరీలు

చెన్నై: ఇంగ్లండ్‌తో జరుగుతున్న సెకండ్ టెస్టు రెండో ఇన్నింగ్స్‎లో భారత్ పట్టు బిగిస్తుంది. వరుసగా వికెట్లు పోతున్నా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆచితూచి ఆడుతున్నాడు. ఆల్ రౌండర్ అశ్విన్ తో కలిసి రాణిస్తున్నాడు. ఈ క్రమంలోనే వీరిద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. లంచ్ సమయానికి టీమిండియా ఆరు వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది.

అంతకుముందు మూడో రోజు ఓవర్ నైట్ స్కోర్‎ 54/1తో ప్రారంభించింది. బ్యాటింగ్ కు వచ్చిన భారత్ టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్స్  రోహిత్ (25),  పుజారా (7), పంత్ (8), హానే కూడా (10), అక్షర్ పటేల్ (7) రన్స్ మాత్రమే చేసి పెవిలియన్ బాటపట్టారు. దీంతో టీమిండియా 106 రన్స్ కే 6 వికెట్లను కోల్పోయి కష్టాలో పడింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కోహ్లీ నాటౌట్ (58), అశ్విన్‎ లు నాటౌట్ (50)తో ఇద్దరు ఇన్సింగ్స్‎ను ముందుకు నడిపిస్తున్నారు.

60 ఓవర్లకు 192/6గా ఉన్న భారత్.. ఇప్పటి వరకు 387 రన్స్ లీడ్ లో ఉంది. నాలుగు టెస్టుల సిరీస్‎లో ఫస్ట్ టెస్ట్ గెలిచి సిరీస్ ముందజలో ఇంగ్లండ్ కొనసాగుతోంది. రెండో టెస్టులో విజయం సాధించి సిరీస్ సమం చేయాలని టీమిండియా ఎదురుచూస్తోంది.