ఆపరేషన్ ఫెయిలై మహిళ మృతి

ఆపరేషన్ ఫెయిలై మహిళ మృతి
  • తాళం వేసి పరారైన క్లీనిక్ నిర్వాహకుడు

జీడిమెట్ల, వెలుగు : ఆపరేషన్ ఫెయిల్ అయి ఓ మహిళ మృతి చెందిన ఘటన జగద్గిరిగుట్ట పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. అంజయ్యనగర్​కి చెందిన యాదవరెడ్డి, పుష్పలత దంపతులకు ఇద్దరు సంతానం. కాగా వీరు ఫ్యామిలీ ప్లానింగ్​కోసం ఇటీవల స్థానికంగా చైతన్య నర్సింగ్​హోమ్​క్లీనిక్ ను సంప్రదించారు. దీంతో క్లీనిక్ ​నిర్వాహకుడు సోమేశ్ తక్కువ ఖర్చుతో ట్రీట్ మెంట్ చేయిస్తానని దంపతులను నమ్మించాడు. నాలుగురోజుల కిందట పుష్పలతను ఆస్పత్రిలో చేర్చుకుని ఆపరేషన్ చేశారు.

3 రోజులు అబ్జర్వేషన్ లో ఉండాలని క్లీనిక్ లోనే ఉంచారు. గురువారం ఉదయం యాదవరెడ్డికి క్లీనిక్ సిబ్బంది ఫోన్​చేసి పుష్పలతకు ఆక్సిజన్​అందడంలేదని మరో ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పారు. వెంటనే వచ్చి ఆమెను మరో ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే పుష్పలత చనిపోయిందని అక్కడి డాక్టర్లు తెలిపారు. చైతన్య నర్సింగ్​హోమ్​క్లీనిక్​నిర్వాహకుడు సోమేశ్ ను అడిగేందుకు వెళ్లగా తాళం వేసి పరార్ అయ్యాడు.

దీంతో బాధిత కుటుంబసభ్యులు క్లీనిక్​వద్ద ఆందోళన చేశారు. అనంతరం క్లీనిక్​నిర్వాహకుడి నిర్లక్ష్యంతోనే తన భార్య చనిపోయినట్టు యాదవరెడ్డి కంప్లయింట్ చేయగా కేసు నమోదు చేసి జగద్గిరిగుట్ట పోలీసులు దర్యాప్తు చేపట్టారు.