ఆస్పత్రిలో మహిళ మృతి.. ఆందోళనకు దిగిన బంధువులు

ఆస్పత్రిలో మహిళ మృతి.. ఆందోళనకు దిగిన బంధువులు

వైద్యం వికటించి బాచుపల్లి ఎస్ ఎల్ జి ఆసుపత్రిలో సరస్వతి అనే మహిళ మృతి చెందింది.  హెర్నియా చికిత్స కోసం వచ్చిన  మహిళకు ల్యాప్రోస్కోపీ  సర్జరీ చేశారు వైద్యులు.  వైద్యం వికటించడంతో మరో సర్జరీ  చేశారు. అనంతరం ప్రాణాలు కోల్పోయింది మహిళ. 

దీంతో ఆస్పత్రి ముందు మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే  ప్రాణాలు కోల్పోయిందని ఆరోపించారు.  ఆస్పత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు.  ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.