
వారిద్దరూ ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు. అయితే చిన్న గొడవతో విడిపోయారు. ఆ తర్వాత ఆ యువకుడు ప్రేమించిన అమ్మాయిని మరచిపోయి మరో యువతిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ప్రియురాలి కంటే అందమైన అమ్మాయితో మ్యారేజ్ ఫిక్స్ చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న మాజీ లవర్ వెంటనే పెళ్లి జరిగే చోటుకు చేరుకుంది. సరిగ్గా ఉంగారాలు మార్చుకునే సమయానికి పెళ్లిని అడ్డుకుంది. ఫ్లీజ్ నన్ను మోసం చేయకు అని ప్రియుడిని రిక్వెస్ట్ చేసింది.
గతాన్ని మరిచిపోదామని కొత్త జీవితం స్టార్ట్ చేద్దామంటూ ..అందరిముందు ప్రాదేయపడింది. ఆమె ఆవేధన చూసిన పెళ్లి కూతురు సాటి మహిళ బాధను అర్థం చేసుకుంది. పెళ్లికొడుని వదిలి.. అక్కడి నుంచి వెళ్లిపోయింది. వెంటనే వరుడు కూడా పెళ్లి కూతురు వెనకాలే వెళ్లగా..అతడి ప్రియురాలు కూడా వారి వెనకాలే పరుగులు తీసింది. ఈ సంఘటన చైనాలో జరిగింది. చివరకు వీరి మ్యారేజ్ ఎవరితో అయ్యిందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.