డ్రై ఫ్రూట్స్ తో నగలు.. ఒంటి నిండా అలంకారం

డ్రై ఫ్రూట్స్ తో నగలు.. ఒంటి నిండా అలంకారం

చిన్న పార్టీ లేదా ఏదైనా ఫంక్షన్ ఉందంటే చాలు.. అమ్మాయిలు అందంగా రెడీ అవుతుంటారు. కేవలం అందంగా మాత్రమే కాకుండా అందరిలో కొత్తగా కనిపించాలని ఆరాటపడుతుంటారు. అలా అని చీర నుంచి ధరించే నగలు వరకు అన్ని కొత్తగా ఉండటంతో పాటు అందరిలో డిఫరెంట్‌గా ఉండాలనుకుంటారు. ఇటీవల ఓ మహిళ సీమంతం కోసం అందంగా తయారు కావడంతో పాటు డిఫరెంట్‌గా ఉంది. పట్టుచీరను కట్టుకుని.. ఒంటి నిండా నగలు ధరించింది.

వజ్ర వైడూర్యాలు, మణిమాణిక్యాలు పొదిగిన ఆభరణాలను ధరించే స్తోమత ఎంత మందికి ఉంటుంది? ప్రకృతి ప్రసాదించే వాటిని నగలకు జోడిస్తే.. జాతి రత్నాలైనా చిన్నబోవాల్సిందే. ఓ మహిళ  ఆలోచన జనాలను మురిపిస్తున్నది.

ఎన్నో రకాల జ్యువెలరీలు చూసుంటారు. ఇలాంటి జ్యువెలరీని చూసే అవకాశమే లేదు. ముఖ్యంగా మహిళలు అందరికంటే విక్షణమైన డిజైన్‌తో కూడిన నగలు ధరించేందుకే ఇష్టపడతారు. చాక్లెట్‌లు, దీపావళి టపాసులతోటి విభిన్న అలంకరణాలు చూసుంటారు. ఇలా డ్రైఫ్రూట్స్‌తో జ్యువెలరీని మాత్రం చూసి ఉండరు. కానీ ఇది చూడటానికి అద్బుతం.. అన్నంత రేంజ్‌లో ఉన్నాయి ఆ డ్రైఫ్రూట్‌ నగలు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కెర్లు కొడుతోంది.

 ఓ మ‌హిళ చాలా అంద‌రంగా త‌యారైంది. ప‌ట్టు చీర‌ను క‌ట్టుకున్న ఆ సుంద‌రి.. త‌న ఒంటి నిండా న‌గ‌లు ధ‌రించింది. అయితే ఆ న‌గ‌లు అస‌లైన‌వి కావు. ఆమె వేసుకున్నది డ్రై ఫ్రూట్స్‌తో త‌యారైన ఆభ‌ర‌ణాలు(Dry Fruit Jewellery). కాజు, బాదాం, పిస్తాల‌తో ఆభ‌ర‌ణాల‌ను త‌యారు చేశారు. బ‌ల‌మైన ఆహారప‌దార్ధాల‌తో చేసిన దండ‌ల‌ను ఆమె మెడ‌లో, సిగ‌లో, చేతిలో వేసుకున్నది.

 కాజు.. బాదం.. పిస్తా.. ఇలాంటి వాటితో జ్యూయల‌రీ చేసింది ఓ మ‌హిళ‌. త‌న సీమంతంలో ఆమె ఆ ఆభ‌ర‌ణాల‌ను వేసుకున్నది.  ఇంట్లో ఫంక్షన్ ఉంటే.. ఆడ‌వాళ్లు త‌యార్యే తీరే వేరుంటుంది. పెండ్లిల్లకు ముస్తాబు అవ్వడం మరొకెత్తు. అందంగా క‌నిపించేందుకు మేక‌ప్ వేసుకోవ‌డం.. ఖ‌రీదైన న‌గ‌లు ధ‌రించ‌డం ఆడ‌వాళ్ల ప్రత్యేక‌తే. ఇక ఇప్పుడు ఇన్‌స్టాలో ఓ వీడియో అంద‌ర్నీ తిక‌మ‌క పెట్టిస్తోంది.

చెవికి పెట్టుకునే జుంకాల దగ్గర నుంచి వడ్డాణం వరకు అన్నింటిలో బాదం, పిస్తా వంటి డ్రై ఫ్రూట్స్‌ కనిపిస్తాయి. జ్యువెలరీ కూడా భలే వెరైటీగా చూడముచ్చటగా ఉంది. న‌క్లెస్‌, గాజులు, చెవిపోగులు, హెయిర్ బ్యాండ్‌, వ‌డ్డాణం.. లాంటి ఆభ‌ర‌ణాల స్టయిల్‌లో ఆమె డ్రై ఫ్రూట్స్‌, న‌ట్స్‌తో చేసిన వ‌స్తువుల‌ను ఆమె ధ‌రించింది. ఇప్పుడు ఆ వీడియో ఇన్‌స్టాలో వైర‌ల్ అవుతోంది. ఆ వీడియోను ఇప్పటికే కోటి మందికిపైగా చూశారు. ఈ వీడియోపై నెటిజన్లు స్పందించారు.

డ్రై ఫ్రూట్ జ్యూయలరీ” ధరించడం చెడు ఆలోచన, దీంతో ఆహారం వృథా అవుతుందని కొందరు కామెంట్స్ చేశారు.పార్టీల కోసం ఆహారాన్ని వృధా చేయకూడదని ఒక నెటిజన్ కామెంట్ చేశాడు.డ్రై ఫ్రూట్స్ బంగారం లాంటివి చాలా ఖరీదైనవని కొందరు అంటారు.ఆకలితో ఉన్నవారు మాత్రమే ఇలాంటి నగలను ఇష్టపడతారని, ఎందుకంటే ఆకలైనప్పుడు ఆ ఆభరణాలనే తినేయగలరని మరికొందరు ఫన్నీగా కామెంట్లు చేశారు.  ఏదీఏమైనా వెరైటీగా ఉండేందుకుక ట్రై చేయడంలో తప్పులేదు. అయితే అది సమంజసంగా ఉందా లేదా అనేది కూడా చెక్‌ చేయాలి లేదంటే విమర్శల పాలవ్వక తప్పదని మరికొందరు కామెంట్​ చేశారు.