హుస్సేన్ సాగర్లో దూకిన మహిళ ...కాపాడిన శివ కుటుంబసభ్యులు

హుస్సేన్ సాగర్లో దూకిన మహిళ ...కాపాడిన శివ కుటుంబసభ్యులు

ట్యాంక్ బండ్, వెలుగు: హుస్సేన్ సాగర్​లో దూకిన మహిళను ట్యాంక్ బంక్ శివ కుటుంబసభ్యులు కాపాడాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన ప్రకారం.. రామ్ నగర్ కు చెందిన సందీప్, రామంతపూర్ చెందిన శారదకు కొంతకాలం కింద పెండ్లి జరిగింది.  సంతానం కలగడం లేదని భర్తతోపాటు అత్తమామలు వేధించడంతో మనస్తాపం చెందిన శారద శుక్రవారం హుస్సేన్ సాగర్​లో దూకి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. గమనించిన ట్యాంక్ బండ్ శివ కొడుకు, భార్య కాపాడి బయటకు తీసి పోలీసులకు అప్పగించారు. అనంతరం పోలీసులు శారదను ఇంటికి తీసుకెళ్లి, ఆమె భర్తను మందలించారు.