క్షుద్రపూజలు కలకలం.. నగ్నంగా నిలబడి, బూడిద రాసుకుని పూజలు చేస్తూ

 క్షుద్రపూజలు కలకలం..  నగ్నంగా నిలబడి, బూడిద రాసుకుని పూజలు చేస్తూ

జగిత్యాల జిల్లాలో క్షుద్రపూజలు కలకలం రేపుతున్నాయి. నగ్నంగా ఓ యువకుడు స్మశాన వాటికలో తిరుగుతుండడం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. స్మశాన వాటికలో శవాలను కాల్చిన చోట గుర్తు తెలియని ఓ వ్యక్తి  నగ్నంగా నిలబడి  పూజలు చేయడం, బూడిదని శరీరానికి రాసుకోవడం వంటవి  చేస్తున్నాడు. 

నోటితో ఏవేవో మంత్రులు చదువుతున్నాడు. అటు వైపుగా వెళ్తున్న కొందరు యువకులు దీనిని చూసి సెల్ ఫోన్ లో బంధించారు. అనంతరం అతన్ని కర్రలతో వెంబడించి తరిమికొట్టారు. ప్రస్తుతం ఆ యువకుడు  నగ్నంగా తిరిగిన వీడియోలు సోషల్ మీడియాలో  వైరల్ గా మారాయి. 

అయితే యువకుడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అర్థరాత్రి పట్టణంలో ఇలా  యువకుడు  బట్టలు లేకుండా పలు వీధులలో నగ్నంగా తిరుగుతుండడంతో స్థానికులు భయబ్రాంతులకు గురవుతున్నారు.