
మృతుడు నారాయణపేట జిల్లా వాసి
హైదరాబాద్‌సిటీ/ నర్వ, వెలుగు: ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్‌లకు బానిసైన మరో యువకుడు బలయ్యాడు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఓ కేఫ్‌లో పనిచేస్తున్న వెంకటేశ్ (20) ఆన్‌లైన్ లూడో, బెట్టింగ్ యాప్‌ల వల్ల అప్పుల పాలై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
నారాయణ పేట్ జిల్లా నర్వ మండలంలోని రాయికోడ్ గ్రామానికి చెందిన తెలుగు సత్యమ్మ, బాలప్ప రెండో కొడుకు వెంకటేశ్ఎస్సెస్సీ వరకు చదివాడు. కొంతకాలం నుంచి బంజారాహిల్స్ లోని రోస్ట్ కేఫ్‌లో పనిచేస్తున్నాడు. ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్‌లకు బానిసైన వెంకటేశ్.. రూ.5 లక్షల వరకు అప్పులు చేసి ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నాడు.
అప్పు ఇచ్చినవారి ఒత్తిడిని తట్టుకోలేక రెండు రోజుల క్రితం గడ్డి మందు తాగాడు. దీంతో నిమ్స్ దవాఖానలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఆదివారం (జులై 20) చనిపోయాడు. రాయికోడ్ లో మంగళవారం అంత్యక్రియలు పూర్తి చేశారు. వెంకటేశ్‌కు తల్లిదండ్రులతో పాటు అన్న, చెల్లె ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.