
రామచంద్రాపురం, వెలుగు: ఫ్లై ఓవర్‌పై నుంచి దూకి యువకుడు సూసైడ్ చేసుకున్న ఘటన సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పోలీస్‌స్టేషన్‌పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి జిల్లా చేవెళ్లకు చెందిన పి.చంద్రప్ప(33), తల్లి వెంకటమ్మ పది రోజుల కింద తెల్లాపూర్‌లో ఉండే పెద్ద కొడుకు వద్దకు వెళ్లింది. చంద్రప్ప కూడా తెల్లాపూర్‌కు వస్తానని బుధవారం రాత్రి ఫోన్లో అన్నతో మాట్లాడాడు.
కాగా.. గురువారం ఉదయం 8 గంటల సమయంలో చంద్రప్ప బీహెచ్ఈఎల్లో కొత్తగా నిర్మించిన ఫ్లై ఓవర్‌పై నుంచి దూకి చనిపోయాడు. అతను కొద్ది రోజులుగా అప్పుల బాధతో మనస్తాపం చెందుతున్నాడని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రామచంద్రాపురం పోలీసులు కేసు నమోదు చేసి డెడ్ బాడీని పోస్టు మార్టం కోసం పటాన్చెరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.