ఆన్లైన్ గేమ్స్ కు అలవాటు పడి ..యువకుడు ఆత్మహత్య

ఆన్లైన్ గేమ్స్ కు అలవాటు పడి ..యువకుడు ఆత్మహత్య

కామారెడ్డి​, వెలుగు :  ఆన్​లైన్​ గేమ్స్​కు అలవాటుపడి అప్పుల పాలై  కామారెడ్డికి చెందిన ఓ యువకుడు సూసైడ్​ చేసుకున్నాడు. టౌన్​ సీఐ నరహరి వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని ఓం శాంతి కాలనీలో నివసించే వల్లందేవి గోదావరి చిన్న కొడుకు శ్రీకర్ (30) ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అతను ఏడాదిన్నరగా ఆన్​లైన్​ గేమ్స్​కు అలవాటుపడి అప్పులు చేశాడు. అప్పులు తీర్చేందుకు  ఇల్లు అమ్మాడు.  అయినప్పటికీ ఇంకా బాకీలు ఉన్నాయి.  ఇంటి ఆర్థిక పరిస్థితి బాగా లేదు. దీంతో గురువారం మధ్యాహ్నం తల్లి గోదావరి మార్కెట్​కు వెళ్లగా శ్రీకర్ బెడ్​ రూమ్​లో ఉరేసుకున్నాడు. ఆటోలో ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా, చనిపోయినట్లు డాక్టర్​ తెలిపారు.   మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.