గవర్నమెంట్ జాబ్ రావట్లేదని యువకుడు మనస్థాపం.. ఆ తరువాత ఏం చేశాడంటే

గవర్నమెంట్ జాబ్ రావట్లేదని యువకుడు మనస్థాపం.. ఆ తరువాత ఏం చేశాడంటే

బెల్లంపల్లి రూరల్, వెలుగు: ప్రభుత్వ ఉద్యోగం రాకపోవడంతో మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం దేవాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లంబాడి తండా(డీ) గ్రామానికి చెందిన అలిశెట్టి రాజయ్య కొడుకు హరీశ్(28) ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు.

బుధవారం ఉదయం రాజయ్య పనిమీద దేవాపూర్‌‌కు వెళ్లగా, తల్లి జన్నారం వద్ద బంధువుల ఇంటికి వెళ్లింది. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చి చూడగా హరీశ్ ఇంట్లో దూలానికి ఉరేసుకున్నాడు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించినప్పటికీ జాబ్ రాకపోవడంతో మానసిక ఒత్తిడికి గురై ఈ నిర్ణయం తీసుకున్నట్లు సూసైడ్ నోట్‌‌లో పేర్కొన్నాడు.