జగిత్యాల జిల్లా మల్యాల పోలీస్ స్టేషన్ ఆవరణలోనే ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. నూకపల్లి డబుల్ బెడ్రూం కాలనికి చెందిన యువకుడు మహ్మద్ అఖిల్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని అంటించుకునేందుకు యత్నించాడు. సమయానికి అప్రమత్తమైన పోలీసులు అతడిని కాపాడి ఆస్పత్రికి తరలించారు.
మహ్మద్ అఖిల్ తల్లి అన్వర్ బేగం ఇటీవల హత్మ హత్య చేసుకుని చనిపోయింది. ఆత్మహత్యకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని గత కొన్ని రోజులుగా పోలీస్ స్టేషన్ కు తిరుగుతున్నాడు. పీఎస్ చుట్టూ తిరుగుతున్నా తనకు న్యాయం చేయడం లేదని ఇవాళ స్టేషన్ ప్రహరీ గోడ ఎక్కి ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు అఖిల్. అక్కడున్న పోలీసులు,స్థానికులు నిప్పు అంటించుకునే లోపే వెంటనే కిందికి దించి ఆసుపత్రికి తరలించారు. తన తల్లి ఆత్మహత్యకు గల కారకులపై చర్యలు తీసుకుని.. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశాడు అఖిల్. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
