రోడ్లు బాగుచేయకుంటే ఫ్యామిలీ మొత్తం సూసైడ్‌‌‌‌ చేసుకుంటం

రోడ్లు బాగుచేయకుంటే ఫ్యామిలీ మొత్తం సూసైడ్‌‌‌‌ చేసుకుంటం
  • ఎమ్మెల్యే, కలెక్టర్‌‌‌‌, కమిషనర్‌‌‌‌కు యువకుడి వాట్సప్‌‌‌‌ మెసేజ్‌‌‌‌

మరిపెడ, వెలుగు : రోడ్లను బాగు చేయాలని ఆఫీసర్లకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, పరిస్థితి మారకుంటే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటానని ఓ యువకుడు సోషల్‌‌‌‌ మీడియాలో పెట్టిన పోస్ట్‌‌‌‌ వైరల్‌‌‌‌గా మారింది. మహబూబాబాద్‌‌‌‌ జిల్లా మరిపెడ మున్సిపల్‌‌‌‌ కేంద్రంలోని పూలబజార్‌‌‌‌లోని రోడ్లు బురదమయంగా మారాయి. దీంతో కాలనీకి చెందిన మహ్మద్‌‌‌‌ ముక్తార్‌‌‌‌ అనే వ్యక్తి రోడ్ల ఫొటోలు, వీడియోలను ఎమ్మెల్యే, కలెక్టర్‌‌‌‌, కమిషనర్‌‌‌‌కు షేర్‌‌‌‌ చేశాడు.

‘ఫొటోలు, వీడియోలు చూసి స్పందించకపోతే ఫ్యామిలీ మొత్తం సూసైడ్‌‌‌‌ చేసుకుంటాం. దోమలతో ఎలాగైనా రోగాల పాలవుతున్నాం. అదేదో ముందే మందు తాగి చనిపోతే పనైపోతుంది’ అని పోస్ట్‌‌‌‌ చేశాడు. యువకుడి పోస్ట్‌‌‌‌కు సంబంధించిన స్క్రీన్‌‌‌‌ షాట్లు ప్రస్తుతం సోషల్‌‌‌‌ మీడియాలో వైరల్‌‌‌‌గా మారాయి.