మూడు రోజుల్లో పెళ్లి పెట్టుకుని పాపం చచ్చిపోయిండు !

మూడు రోజుల్లో పెళ్లి పెట్టుకుని పాపం చచ్చిపోయిండు !

ఎల్బీనగర్, వెలుగు: మూడు రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఓ  యువకుడు సూసైడ్​ చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వనస్థలిపురం సాహెబ్ నగర్ కు చెందిన పారంద శ్రీకాంత్(33) స్థానికంగా రియల్ ఎస్టేట్ చేస్తుంటాడు. కొద్ది రోజుల క్రితమే యాచారానికి చెందిన ఓ అమ్మాయితో పెళ్లి ఫిక్స్ అయ్యింది. ఈ నెల 23న ఆదివారం పెళ్లి ఉండగా వెడ్డింగ్​ కార్డులు కూడా పంచారు. గురువారం తెల్లవారుజామున శ్రీకాంత్ పాయిజన్ తీసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణమని పోలీసుల ప్రాథమికంగా గుర్తించారు.