జియో హాట్‌‌‌‌‌‌‌‌స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో టాప్‌‌‌‌‌‌‌‌లో విక్రమ్ ఆన్ డ్యూటీ వెబ్ సిరీస్

జియో హాట్‌‌‌‌‌‌‌‌స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో టాప్‌‌‌‌‌‌‌‌లో విక్రమ్ ఆన్ డ్యూటీ వెబ్ సిరీస్

‘బిగ్ బాస్’ విన్నర్ నిఖిల్ మలియక్కల్ హీరోగా బ్రహ్మ రుద్ర దర్శకత్వంలో రూపొందిన క్రైమ్ థ్రిల్లర్  ‘విక్రమ్ ఆన్ డ్యూటీ’.  జ్ఞాపిక ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌‌‌‌‌మెంట్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై  ప్రవీణ, అనిల్ కడియాల నిర్మించారు.  జియో హాట్‌‌‌‌‌‌‌‌స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో స్ట్రీమ్ అవుతున్న ఈ సిరీస్ టాప్ వన్‌‌‌‌‌‌‌‌లో ట్రెండ్ అవుతోంది. 

ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌‌‌‌‌‌‌‌మీట్‌‌‌‌‌‌‌‌కు అతిథిగా హాజరైన ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి మాట్లాడుతూ ‘ఈ  సిరీస్‌‌‌‌‌‌‌‌లో  కొన్ని  గ్లింప్స్ చూశా. చాలా ఇంటరెస్టింగ్‌‌‌‌‌‌‌‌గా అనిపించింది. డిటెక్టివ్, యాక్షన్ కలయికలో ఉన్న ఈ సిరీస్ అందరినీ ఆకట్టుకుంటుంది.  టీమ్ అందరికీ నా అభినందనలు’ అని అన్నారు. 

మంచి టీమ్ వర్క్‌‌‌‌‌‌‌‌తో ఈ ప్రాజెక్ట్ చేశామని, దీన్ని ఆదరిస్తున్న అందరికీ థ్యాంక్స్ అని నిఖిల్ అన్నాడు.  డైరెక్షన్ చాన్స్ ఇచ్చిన ప్రవీణ, అనిల్‌‌‌‌‌‌‌‌కు బ్రహ్మ రుద్ర థ్యాంక్స్ చెప్పాడు. ఈ సిరీస్ అందర్నీ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్ చేయడం చాలా సంతోషంగా ఉందని నిర్మాతలు అన్నారు.  నటులు అమర్, ఆషు రెడ్డి, మ్యూజిక్ డైరెక్టర్ సుహాస్,  రైటర్ శ్రీ హర్ష పాల్గొన్నారు.