
ఎల్బీనగర్, వెలుగు : పట్టపగలు నడిరోడ్డుపై మద్యం తాగుతూ ఓ యువతి, యువకుడు హల్చల్చేశారు. ఓ చేతిలో సిగరెట్, మరో చేతిలో బీర్‌బాటిల్‌తో నానా హంగామా సృష్టించారు. పబ్లిక్‌ప్లేస్‌లో ఇలా చేయడం కరెక్ట్కాదని అటుగా వచ్చిన వాకర్లు, సీనియర్సిటిజన్లు వారిని అడ్డుకోగా వారితో దురుసుగా ప్రవర్తించారు. బూతులు తిడుతూ రెచ్చిపోయారు. ఈ ఘటన నాగోలు పోలీస్‌స్టేషన్‌పరిధిలోని ఫతుల్లగూడ వద్ద గురువారం ఉదయం జరిగింది. యువతీయువకుడి హంగామా వీడియో శుక్రవారం సోషల్‌మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. గురువారం ఉదయం 6 గంటలకు ఫతుల్లాగూడ సమీపంలోని సర్వీస్‌రోడ్డుపై బుడిచర్ల అలెక్స్, బార్లీ అనే యువతీయువకుడు కారు(టీఎస్10ఎఫ్ హెచ్0868) ఆపారు.
కారులో ఫుల్సౌండ్తో పాటలు పెట్టి, నడిరోడ్డుపై స్మోక్చేస్తూ.. బీర్తాగడం మొదలుపెట్టారు. అదే టైంలో అటుగా వాకింగ్‌కు వచ్చిన స్థానికులు, సీనియర్‌సిటిజన్స్ వారిని అడ్డుకున్నారు. పట్టపగలు అందరి ముందు నడిరోడ్డుపై మద్యం తాగడమేంటని నిలదీశారు. దీంతో యువతీయువకుడు వారితో వాగ్వాదానికి దిగారు. ఓ చేతిలో బీర్‌బాటిల్, మరో చేతిలో సిగరెట్‌తో బార్లీ రెచ్చిపోయింది. ఆ తంతంగాన్ని వీడియో తీస్తున్న వ్యక్తిని బూతులు తిడుతూ దాడి చేసింది. మీరెవరూ మద్యం, సిగరెట్లు తాగట్లేదా అంటూ బార్లీ వారిని దుర్భాషలాడింది.
పోలీసులకు ఫోన్చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తి ఫోన్లాక్కోబోయింది. చివరికి స్థానికులంతా వారిపై మండిపడడంతో యువతీయువకుడు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఫతుల్లాగూడ సర్వీస్‌రోడ్డులో రోజూ ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. బైకులు, కార్లలో వచ్చి రేసులు నిర్వహిస్తున్నారని, స్టంట్లు వేస్తున్నారని వాపోతున్నారు. పోలీసులు పట్టించుకోవడం లేదని, సమాచారం ఇచ్చినా సరైన స్పందన ఉండడం లేదని మండిపడుతున్నారు. యువతీయువకుడు హల్చల్ఘటనకు సంబంధించిన వీడియో శుక్రవారం సోషల్‌మీడియాలో వైరల్అవడంతో పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.