నాకే బ్రేకప్ చెప్తావా ? చూడు నిన్నేం చేస్తానో ? చాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జీపీటీ సాయంతో ఫేక్ షీ టీమ్ నోటీసు పంపిన ప్రియురాలు

నాకే బ్రేకప్ చెప్తావా ? చూడు నిన్నేం చేస్తానో ? చాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జీపీటీ సాయంతో ఫేక్ షీ టీమ్ నోటీసు పంపిన ప్రియురాలు
  • ఫ్రెండ్​ నంబర్​ నుంచి వాట్సాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రియుడికి.. ఇద్దరిపై కేసు నమోదు
  • నిందితురాలు మహీంద్రా వర్సిటీలో స్టూడెంట్

సైఫాబాద్, వెలుగు: ప్రేమించిన యువకుడు బ్రేకప్​ చెప్పాడని, సోషల్ మీడియాలో బ్లాక్ చేశాడని ఓ యువతి పగబట్టింది. తిరిగి తన దగ్గరకు వచ్చేలా చేయాలనే ఉద్దేశంతో షీ టీమ్స్ పేరుతో నకిలీ పోలీసు నోటీసును సృష్టించి వాట్సాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పంపించింది. ఇందుకోసం చాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జీపీటీ సాయం తీసుకుంది.

నోటీసు వచ్చిందని ఎంక్వైరీకి వెళ్లిన సదరు యువకుడికి అలాంటిదేమీ లేదని తేలడంతో అవాక్కయ్యాడు. ఇదంతా ఎవరు చేశారా అని పోలీసులకు కంప్లయింట్​ఇచ్చాడు. వారి విచారణలో అసలు విషయం బయటపడడంతో షాక్​కు గురయ్యాడు. ఈ కేసులో యువతితో పాటు ఆమెకు సహకరించిన స్నేహితుడిపై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.

ఐదేళ్ల ప్రేమ.. ఏడాదిగా దూరం
కూకట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీ కాలనీ, బాలాజీనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన తిరునేశ్వర్ వీరంకి (24), మహీంద్రా యూనివర్సిటీకి చెందిన ఓ విద్యార్థిని ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. గాఢమైన ప్రేమలో ఉన్నప్పుడు ఆమెను పెండ్లి చేసుకుంటానని మాటిచ్చాడు. అయితే, ఏడాది నుంచి ఏదో కారణంతో ఆమెకు దూరంగా ఉంటున్నాడు. బ్రేకప్ ​చెప్పి సోషల్ మీడియాలో కూడా బ్లాక్​చేశాడు. దీంతో అతడంటే పిచ్చి ప్రేమలో ఉన్న సదరు యువతి అతడిని ఎలాగైనా తిరిగి తన దగ్గరకు రప్పించుకోవాలని భావించింది.

చాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జీపీటీతో నకిలీ నోటీసు
దీని కోసం తన ఫ్రెండ్​తో కలిసి ఒక ప్లాన్ ​వేసింది. వేధిస్తున్నట్టు షీ టీమ్స్ పేరుతో పోలీసుల నోటీసు పంపితే భయపడి మళ్లీ దగ్గరకు వస్తాడని భావించింది. ఇందుకోసం చాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జీపీటీ సాయంతో షీ టీమ్స్ పేరుతో నకిలీ నోటీసు తయారు చేసింది. అందులో విచారణకు హాజరు కావాలంటూ ఆమె స్నేహితుడి వాట్సాప్ నుంచి పంపించింది.

దీంతో భయపడిన తిరునేశ్వర్​ అసెంబ్లీ ఎదురుగా ఉన్న షీ టీమ్స్ ఆఫీసుకు విచారణకు వచ్చాడు. ఆ నోటీసు పరిశీలించిన అధికారులు అది నకిలీదిగా గుర్తించారు. దీంతో షీ టీమ్స్ ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐ వెంకటేష్ సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి విచారణలో అసలు విషయం బయటపడింది. దీంతో సదరు యువతితో పాటు ఆమెకు సహకరించిన యువకుడిపై కేసు నమోదు చేశారు.