
అల్లరి నరేష్ ఫరియా అబ్దుల్లా జంటగా మల్లి అంకం దర్శకత్వంలో రాజీవ్ చిలక నిర్మించిన చిత్రం 'ఆ ఒక్కటీ అడక్కు' శుక్రవారం సినిమా రిలీజ్ ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్యఅతిథిగా హాజరైన అడివి శేష్ మాట్లాడుతూ' నా మనసులో నరేష్ గారు అంటే ఇంట్లో మనిషి ఆయన ఎప్పుడూ ఇతరుల ఆనందాన్ని కోరుకుంటారు. థియేటర్స్లో ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా ఈ సినిమా ఉంటుంది' అని టీమ్ అందరికీ ఆల్ చబెస్ట్ చెప్పాడు. కార్యక్రమంలో పాల్గొన్న దర్శకులు విజయ్ కనకమేడల, విజయ్ చిన్ని, దేవ కట్టా సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేశారు.
నరేష్ మాట్లాడుతూ 'మా నాన్నగారు ఉన్నన్ని రోజులు నాతో సినిమాలు చేసి, హిట్లు ఇచ్చి, నన్ను సక్సెస్ ఫుల్ యాక్టర్ని చేశారు. ఆయన లేనప్పుడు కూడా ఆయన టైటిల్ ఇచ్చి ఈ సినిమాతో ఫోన్ చేస్తున్నాడు. ఇది బరువుగా, బాధ్యతగా ఫీలవుతున్నా తప్పకుండా మంచి పేరుని కాపాడతా నని మాటిస్తున్నా ఈ మండు వేసవిలో బాధలు మర్చిపోయి రెండు గంటలు హాయిగా నవ్వుకునేలా ఈ చిత్రం ఉంటుంది' అని చెప్పాడు. ఈ హోల్సమ్ ఎంటర్టైనర్ని తెరపై చూడటానికి చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నా అంది ఫరియా అబ్దుల్లా, అందరినీ అలరించే మంచి ఫ్యామిలీ ఎంట ర్ టైనర్ ఇదని దర్శకుడు మల్లి అంకం, నిర్మాత రాజీవ్ చిలక అన్నారు. టీమ్ అంతా పాల్గొన్నారు.