
అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా మల్లి అంకం దర్శకత్వంలో రాజీవ్ చిలక నిర్మిస్తున్న చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఇప్పటికే ఈ మూవీ టీజర్‌తో సినిమాపై ఆసక్తిని పెంచిన మేకర్స్.. సోమవారం రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. సమ్మర్ స్పెషల్‌గా మే 3న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు తెలియజేశారు. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ఏపీ, తెలంగాణలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తోంది.
ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో నరేష్, ఫరియా వధూవరుల గెటప్‌లో ఆకట్టుకున్నారు. ఇదొక కంప్లీట్ కామెడీ ఎంటర్‌టైనర్. చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ అవుట్ అండ్ అవుట్ ఫన్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నాడు. వెన్నెల కిశోర్, అరియానా గ్లోరి, జామీ లివర్, వైవా హర్ష ఇతర పాత్రలు పోషించారు. గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నాడు. భరత్ లక్ష్మీపతి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.