
అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా మల్లి అంకం దర్శకత్వంలో రాజీవ్ చిలక నిర్మిస్తున్న చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. మే 3న వరల్డ్‌వైడ్‌గా విడుదల కానుంది. సోమవారం ఈ మూవీ ట్రైలర్‌ను నాని రిలీజ్ చేశాడు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ ‘ట్రైలర్ హిలేరియస్‌గా ఉంది. చాలా ఎంజాయ్ చేశా. నరేష్ బ్యాక్ టు బ్యాక్ కామెడీ సినిమాలు చేస్తుంటే, వాటికి కొంచెం బ్రేక్ ఇవ్వమని నేనే అడిగా. కానీ ఈ ట్రైలర్ చూస్తుంటే ఈ బ్రేక్‌లో తన కామెడీ మిస్ అయ్యానని అనిపించింది. ఇందులో పెళ్లి కంటెంట్ అందరూ రిలేట్ అయ్యేలా ఉంది.
హాయిగా ఎంజాయ్ చేసే సినిమా అని ట్రైలర్ చూస్తుంటే అర్ధమవుతుంది. తప్పకుండా సక్సెస్ అవుతుందని కోరుకుంటున్నా’ అని అన్నాడు. నరేష్ మాట్లాడుతూ ‘చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ కామెడీ మూవీతో వస్తున్నా. కచ్చితంగా సమ్మర్‌లో బాగా నవ్విస్తాను’ అని చెప్పాడు. సిద్ధి పాత్రలో అందర్నీ నవ్విస్తానని చెప్పింది ఫరియా అబ్దుల్లా. ఆడియెన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుందని డైరెక్టర్ మల్లి అంకం చెప్పాడు. నరేష్‌తో వర్క్ చేయడం మంచి అనుభవం అని అన్నారు నిర్మాత రాజీవ్ చిలక. ఎడిటర్ చోటా కె ప్రసాద్, రైటర్ అబ్బూరి రవి తదితరులు పాల్గొన్నారు.