ఆడాళ్లు మీకు జోహార్లు ఫస్ట్ లుక్

ఆడాళ్లు మీకు జోహార్లు ఫస్ట్ లుక్

కిశోర్‌ తిరుమల డైరెక్షన్ లో శ‌ర్వానంద్ హీరోగా నటిస్తున్న ఆడాళ్లు మీకు జోహార్లు ఫస్ట్ లుక్ రిలీజైంది. శర్వానంద్ కు జోడీగా రష్మిక నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ను దసరా పండుగ సందర్భంగా ఇవాళ రిలీజ్ చేసింది యూనిట్.  దసరా కానుకగా ప్రజలందరికీ శుభాకాంక్షలు చెబుతూ ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఇంట్లో పండుగ వాతావరణాన్ని తలపించేలా.. గుమ్మానికి పూల తోరణాలు కట్టేశారు. ఇందులో రష్మిక, శర్వా ఇద్దరూ తెగ నవ్వులు చిందిస్తున్న పిక్ ఆకట్టుకుంటుంది. కుష్బూ, రాధిక శరత్ కుమార్, ఊర్వశీ వంటి వారు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీకి సుజిత్ సారంగ్  కెమెరామెన్‌గా, శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.