ఆధార్​ ఆథరైజేషన్​ ట్రాన్సాక్షన్స్ రూ. 199 కోట్లు

ఆధార్​ ఆథరైజేషన్​ ట్రాన్సాక్షన్స్ రూ. 199 కోట్లు

జవనరిలో ఆధార్​ ఆథరైజేషన్​ ట్రాన్సాక్షన్స్​ రూ.199 కోట్లు అని, కార్డుదారులు ఇప్పటివరకు 9,029.28కి పైగా చేసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వ ​డేటా చెబుతోంది. భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్ ఆర్థిక వ్యవస్థ ఇదేనని ప్రభుత్వం పేర్కొంది. ఈ నెల( జనవరి)లో  135.53 కోట్ల బయోమెట్రిక్ వేలిముద్ర ఆథరైజేషన్​ జరిగినట్లు చెబుతోంది. 

జనవరిలో కార్డ్ హోల్డర్ల అభ్యర్థనలపై 1.37 కోట్లకు పైగా ఆధార్ కార్డుల సమాచారం నవీకరించబడింది. అదే నెలలో 29.52 కోట్ల కంటే ఎక్కువ ఈకేవైసీ లావాదేవీలు జరిగాయి. నెలాఖారు నాటికి, ఇప్పటివరకు ఆధార్ ఈ–కేవైసీ లావాదేవీల సంచిత సంఖ్య 1412.25 కోట్లకు పెరిగింది. ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ (ఏఈపీఎస్​) ఆదాయ స్పెక్ట్రమ్‌లో దిగువన ఉన్న వారికి ఆర్థిక చేరికను కల్పిస్తోంది. నెలాఖరుకు మొత్తంగా, ఏఈపీఎస్, మైక్రో–ఏటీఎంల నెట్‌వర్క్ ద్వారా 1,629.98 కోట్ల బ్యాంకింగ్ లావాదేవీలు సాధ్యమయ్యాయి’ అని నివేదికలో పేర్కొంది.