శ్రీశైలంలో ఎంట్రీకి ఆధార్ కార్డు ఉండాల్సిందే

శ్రీశైలంలో ఎంట్రీకి ఆధార్ కార్డు ఉండాల్సిందే

కర్నూలు: భూకైలాస క్షేత్రం శ్రీశైలం దేవస్థానంలో దర్శనంతో పాటు ఇతర సేవలు పొందాలంటే ఆధార్ కార్డు ఉండాల్సిందే. ఈ మేరకు దేవస్థానం నిర్ణయం తీసుకుంది. ఆన్ లైన్ ద్వారా  లేదా కరెంట్ బుకింగ్ కౌంటర్ ద్వారా దర్శనం, అభిషేకాలు, కుంకుమార్చన, ఆర్జిత హోమాలు  బుక్ చేసుకోవాలంటే భక్తులు ఆధార్ కార్డు తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. అదేవిధంగా బ్రేక్ దర్శనం, స్పర్షదర్శనం టికెట్ల కోసం బుక్ చేసుకునే వారు కూడా ఆధార్  కార్డు సమర్పించాల్సి ఉంటుంది. 
పూర్తి పారదర్శకత కోసం ఈ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు దేవస్థానం ఈవో లవన్న ఒక ప్రకటనలో తెలియజేశారు. దళారులను, నకిలీలు, మోసాలను నివారించేందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఈవో వివరించారు. సేవల విషయంలో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే తనకు లేదా.. దేవస్థానం కార్యాలయంలో తెలియజేస్తే తగిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.