పౌరసత్వానికి ఆధార్ ప్రూఫ్ కాదు.. విదేశీయుడు కూడా రేషన్ కోసం ఆధార్ పొందే చాన్స్ ఉంది: సుప్రీంకోర్టు

పౌరసత్వానికి ఆధార్ ప్రూఫ్ కాదు..  విదేశీయుడు కూడా రేషన్ కోసం ఆధార్ పొందే చాన్స్ ఉంది: సుప్రీంకోర్టు
  • ఓటరు జాబితా నుంచి తొలగించేముందు నోటీసివ్వాలి
  • ఎన్నికల కమిషన్ ది పోస్టాఫీస్ పాత్ర కాదని వ్యాఖ్య

ఢిల్లీ: ఆధార్ కార్డు ఉన్నంత మాత్రాన వ్యక్తి భారత పౌరుడని తేలదు, ఆ ఆధార్ ఆధారంగా ఓటు హక్కు ఇవ్వలే మని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పలు రాష్ట్రాల్లో ఎన్నికల కమిషన్ చేపట్టిన ప్ర త్యేక ముమ్మర ఓటరు జాబితా సవరణ ను సవాల్ చేసిన పిటిషన్ల విచారణలో, అద్దెకు పనిచేసే విదేశీయుడు కూడా రేషన్ కోసం ఆధార్ పొందే అవకాశం ఉందని, అలా పొందిన ఆధార్ కార్డు ఓటు హక్కుకు అర్హత ఇవ్వదని ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ వ్యాఖ్యానిం చారు. 

ఆధార్ చట్టం కూడా పౌరసత్వం లేదా నివాస హక్కు నిర్ధారణకు ఇదిపూర్తిస్థాయి సాక్ష్యం కాదని స్పష్టంగా చె బుతోందని అన్నారు." ఓటరు జాబితా నుంచి పేరు తొలగించే ముందు తప్పనిసరిగా నోటీసు ఇవ్వాలని, ఆధార్ ఒక్కటే నిర్ణయాత్మక పత్రం కాదని బెంచ్ పునరుద్ఘాటించింది.

ఈసీది పోస్టాఫీస్ పాత్ర కాదు

ఎన్నికల కమిషన్ ది కేవలం పత్రాలు స్వీకరించే పోస్టాఫీస్ పాత్ర కాదని, సమర్పించిన పత్రాల నిజానిజాలు పరిశీలించాలని సూచించింది. మరోవైపు ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రజాస్వామ్య హక్కులను దెబ్బతీస్తోందని, నిరక్షరాస్యులు, బలహీన వర్గాలపై అసంవిధానిక భారమేస్తోందని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదించారు. ఓటరు పేరు జాబితాలో చేరిన క్షణం నుంచి అది సరైనదిగానే పరిగణించాలనీ, తొలగింపు ఎలాంటి సందర్భంలోనైనా న్యాయసమ్మతమైన, న్యాయస్పూర్తికి అనుగుణమైన ప్రక్రియ ద్వారా మాత్రమే జరగాలన్నారు. 

ALSO READ : మైనర్ తో అభ్యంతర కంటెంట్‌చేసిన.. 

ఆధార్ పౌరసత్వానికి తుది సాక్ష్యం కాకపోయినా, అది నివాసానికి ఒక ప్రాథమిక ధ్రువీకరణగా పరిగణించవచ్చని సిబల్ తెలిపారు. మరణించిన ఓటర్లను తొలగించడం తప్పనిసరిగా చేయాల్సిన ప్రక్రియ అని జస్టిస్ బాగ్ని వ్యాఖ్యానించారు. పంచాయతీ స్థాయిలో, అధికారిక వెబ్సైట్లలో జాబితాలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయని గుర్తుచేశారు. తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ పై దాఖలైన పిటిషన్లకు సంబంధించి డిసెంబర్ 1లోపు ఈసీ సమాధానాలు దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది.