మైనర్ తో అభ్యంతర కంటెంట్‌చేసిన.. వైరల్ రీల్స్ క్రియేటర్ పై కేసు..పోక్సో కేసు పెట్టాలని నెటిజన్ల డిమాండ్

మైనర్ తో అభ్యంతర కంటెంట్‌చేసిన.. వైరల్ రీల్స్ క్రియేటర్ పై కేసు..పోక్సో కేసు పెట్టాలని నెటిజన్ల డిమాండ్

10 రూపాయల బిస్కెట్ క్లిప్ ట్రెండింగ్ ద్వారా సోషల్ మీడియా స్టార్‌గా మారిన మీరట్ కు చెందిన వైరల్ కంటెంట్ క్రియేటర్ షాబాద్ జకాతి వివాదంలో చిక్కుకున్నాడు.  అసభ్యకరమైన కంటెంట్ చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ప్రముఖ సింగర్ బాద్ షా,క్రికెటర్లు రింకు సింగ్ ,కుల్దీప్ యాదవ్ వంటి స్టార్లు షేర్ చేసేంత స్థాయిలో రీల్స్ వైరల్ కంటెంట్ క్రియేట్ చేసిన జకాతిపై మైనర్ తో అసభ్యకరమైన కంటెంట్ చేసినందుకు యూపీ పోలీసులు కేసు నమోదు చేశారు. 

ఎవరీ షాదాబ్ ?

యూపీలోని  మీరట్ కు చెందిన రీల్స్ వైరల్ కంటెంట్ క్రియేటర్.. 10 రూపాయల బిస్కెట్ వైరల్ రీల్ క్లిప్ తో చాలా ఫేమస్ అయ్యాడు. ఈ క్లిప్ కు పది లక్షల మందిని ఆకర్షించింది. సింగర్ బాద్ షా, క్రికెటర్లు రింకూసింగ్, కుల్దీప్ యాదవ్ వంటి స్టార్లు కూడా ఇతడి రీల్స్ ను షేర్ చేశారు. ఇది సోషల్  మీడియా ఫ్లాట్ ఫాం లో అతనికి పెద్ద సంఖ్యలో అనుచరులను సంపాదించి పెట్టింది. షాబాద్ ఓ చానల్ కు ఇచ్చిన ఇంటర్వూలో కుటుంబం మొత్తం కలిసి చూడగలిగే కంటెంట్ ను క్రియేట్ చేస్తానని చెప్పాడు. అయితే ఇటీవల అతను చేసిన  ఓ అభ్యంతరకర వీడియో క్లిప్ తో పోలీసులు అతనిపై చర్యలు చేపట్టారు. 

నెటిజన్లు స్పందన..

షాబాద్ జకాతి వైరల్ కంటెంట్ పై పోలీసులు కేసుల పై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. కొందరు సపోర్టు చేస్తూ పోస్ట్ లు షేర్ చేశారు. ఇంతకు ముందు కూడా షాబాద్ ఇలాంటి వీడియోలే చేశారు అప్పుడు ఎవరూ పట్టించుకోలేదు.. ఇప్పుడు ఫేమస్ అయిన తర్వాత అతని కంటెంట్ ను అందరూ గమనిస్తున్నారు.. ఈ కంటెంట్ తో అతను తన గౌరవాన్ని తగ్గించుకున్నారంటూ రాశారు. 

 మరికొంత మంది షాబాద్ ను వ్యతిరేకించారు. కంటెంట్ లో కుల, రాజకీయ పరంగా కొన్ని వివాదాస్పద రీల్స్ చేస్తున్నాడు..  ఇక వైరల్ అవుతున్న వీడియోలో జకాతి చిన్నారిని ఇన్వాల్వ్ చేయడం తో POCSO చట్టం కింద కేసు నమోదు చేయాలని , ఇంటర్నెట్ లో ఇలాంటి కంటెంట్ చాలా ఉంది చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏదీ ఏమైనా రీల్స్ చేసేవారికి, యూట్యూట్ కంటెంట్ క్రియేటర్లకు ఇదొక వార్నింగ్ గా చెప్పొచ్చు.