
ఆధార్ కార్డ్‌ను యూఐడిఎఐ పోర్టల్ లేదా డిజిలాకర్ యాప్‌ల ద్వారా ప్లాట్‌ఫామ్‌లను తీసుకునేవాళ్లు. అయితే ఇప్పుడు వాటితో పనిలేదు. ఆధార్, ఇతర డిజిటల్–లింక్డ్ డాక్యుమెంట్లను సేఫ్‌గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అందుకోసం కాంటాక్ట్‌లలో mygov హెల్ప్ డెస్క్ నెంబర్ (+91–9013151515)ను సేవ్ చేయాలి.
వాట్సాప్ ఓపెన్ చేసి Hi లేదా Namaste అని టైప్ చేయాలి. తర్వాత చాట్‌బాట్ మెను నుంచి డిజిలాకర్ సర్వీస్‌లను సెలక్ట్ చేయాలి. డిజిలాకర్ అకౌంట్ ఓపెన్ చేసి 12 అంకెల ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. వెరిఫికేషన్ కోసం ఎంటర్ చేయాలి. అథెంటికేషన్ తర్వాత చాట్‌బాట్ అందుబాటులో ఉన్న డాక్యుమెంట్ల లిస్ట్‌ను డిస్ప్లే చేస్తుంది. ఆధార్ కార్డ్ ఎంచుకుని, పీడీఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
అయితే ఈ ప్రాసెస్‌లో ఒకేసారి ఒక డాక్యుమెంట్ మాత్రమే డౌన్లోడ్ చేయాలి. లేదంటే యూజర్లు డిజిలాకర్ యాప్ లేదా వెబ్సైట్ ద్వారా అప్డేట్ చేయొచ్చు. ఈ సర్వీస్ పూర్తిగా చాలా సేఫ్, యూజర్ ప్రైవసీ కూడా ఉంటుంది. ఈ ఫీచర్ ద్వారా ఆధార్ కార్డ్‌ను ఫాస్ట్‌గా, ఈజీగా యాక్సెస్ చేయొచ్చు.