
బీహార్ ఓటర్ లిస్టులో పేర్ల తొలగింపుపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఓటర్ లిస్టు సవరణకు ఆధార్ కార్డు సరిపోతుందని స్పష్టం చేసింది. ఆధార్ కార్డును ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్స్ గా ఓటర్లు సబ్మిట్ చేయవచ్చునని చెప్పింది. ప్రభుత్వం జారీ చేసిన ఆధార్ కార్డును లిస్టులో యాడ్ చేయాల్సిందిగా ఎన్నికల కమిషన్ కు సూచించింది.
బీహార్ లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) పేరున ఓటర్ లిస్టు నుంచి దాదాపు 65 లక్షల మంది పేర్లు తొలగించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై నమోదైన పిటిషన్లపై శుక్రవారం (ఆగస్టు 22) విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. ఓటర్ల జాబితాలో డిలీట్ అయిన వారి పేర్లు మళ్లీ నమోదు చేసేందుకు ఎన్నికల సంఘం సూచించిన 11 గుర్తింపు పత్రాలలో ఏదో ఒకటి జత చేయాలి లేదా ఆధార్ కార్డును సబ్మిట్ చేసి నమోదు చేసుకోవచ్చునని సూచించింది.
రాజకీయ పార్టీలకు సూచనలు:
ఈ సందర్భంగా బీహార్ లో రాజకీయ పార్టీల వ్యవహారంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఓటర్ లిస్టు నుంచి 65 లక్షల ఓట్లను తొలగించారని ఆందోళన చెందుతున్న పార్టీలు.. ఓటర్లకు ఆధార్ కార్డు లేదా ఇతర కార్డులతో మళ్లీ నమోదు చేసుకునేందుకు పార్టీలు ఎందుకు సహాయం చేయడం లేదని ప్రశ్నించింది. ఈ విషయంలో బూత్ లెవల్ ఏజెంట్లు ఏం చేస్తు్న్నారని మండి పడింది.
►ALSO READ | రైళ్లలో అదనపు లగేజీ ఛార్జీలపై క్లారిటీ.. అదంతా ఫేక్, ఆ ఆలోచనే లేదు: అశ్వినీ వైష్ణవ్
బీహార్ లో ఉన్న 12 పొలిటికల్ పార్టీలు.. ఓటర్లకు సహాయం చేసేందుకు పార్టీ కార్యకర్తలను ఆదేశించాలని సూచించింది. ఎన్నికల కమిషన్ ఫామ్ 6 లో సూచించిన విధంగా 11 డాక్యుమెంట్లు లేదా ఆధార్ కార్డుతో డిలీట్ అయిన ఓటర్లు మళ్లీ నమోదు చేసుకునేందుకు కార్యకర్తలు సహాయం చేయాల్సిందిగా ఆదేశించింది.