పశువులకూ ఆధార్ కార్డు

పశువులకూ ఆధార్ కార్డు

పశువులకు కూడా ఆధార్ కార్డు ఇస్తామని,    ఏ రోగమొచ్చినా ఆ కార్డులో నమోదు చేస్తారని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం చింతపట్ల గ్రామంలో మంగళవారం జీవాలకు  నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి  ప్రారంభించారు.  ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూ గతంలో ఏటా ఒకటి రెండు సార్లు నట్టల మందు వేసేవారని, తెలంగాణ ఏర్పడిన తర్వాత మూడుసార్లు మందులు వేస్తున్నామన్నారు. జీవాల వద్దకే వైద్యం తీసుకువెళ్లాలని 100 సంచార పశువైద్యశాలలు ఏర్పాటు చేశామన్నారు. 1962 ఫోన్ చేస్తే సంచార వైద్య చికిత్స అందిస్తామన్నారు. అదే విధంగా టోల్ ఫ్రీ నంబరు 18004198800 ద్వారా రైతులు సమాచారాన్ని తెలుసుకోవచ్చన్నారు. అలాగే పశువుల ఆరోగ్యం కోసం హెల్త్ కార్డులను అందజేస్తామన్నరు.   ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, పశుసంవర్థక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, టీఎస్ఎల్డీఏ సీఈవో మంజువాణి పాల్గొన్నారు.

మూడుచింతలపల్లి  : పశువులకు సీజనల్​ వ్యాధులు ప్రభలకుండా టీకాలు ఇప్పించాలని కార్మిక శాఖ మంత్రి చేమకూర మల్లారెడ్డి సూచించారు. మంగళవారం మూడుచింతలపల్లి మండలం కొల్తూరు గ్రామంలో  గొర్రెలకు, మేకలకు ఉచిత నట్టల నివారణ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. గొర్రెలలో, మేకలకు  నట్టల నివారణ మందువు వేయడం వల్ల వాటి  రోగ నిరోధక శక్తి పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ శిల్ప, రాష్ట్ర ఎంపీపీ ఫోరం అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్, ఎంపీపీ హారిక, జడ్పీటీసీ అనిత, జిల్లా పశువైద్య అధికారి వీరానంద్, మార్కెట్ కమిటీ చైర్మన్ విష్ణుగౌడ్ పాల్గొన్నారు.

కీసర : శివాజీ నగర్ కాలనీలో మంగళవారం గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందు లును ఎంపీపీ స్వప్న పంపిణీ చేశారు. పశుసంవర్ధక శాఖ నిర్వహిస్తున్న నట్టల నివారణ కార్యక్రమాన్ని పశుపోషకులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ సూచించారు.   కార్యక్రమంలో జడ్పీటీసీ రమాదేవి, సర్పంచ్ మధురి, ఉపసర్పంచ్ బాలమణి, ఎంపీటీసీ జంగయ్య యాదవ్, మండల పశు వైద్య అధికారి డా.హరి కృష్ణ, పశువైద్యాధికారి డా.జేవ్యా పాల్గొన్నారు.