ఈసారి హిట్ కొట్టబోతున్నామనే కాన్ఫిడెన్స్‌‌ తో ఉన్నా

ఈసారి హిట్ కొట్టబోతున్నామనే కాన్ఫిడెన్స్‌‌ తో ఉన్నా

ఆది సాయి కుమార్ హీరోగా యగంధర్ ముని తెరకెక్కించిన చిత్రం ‘శంబాల’.  రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్ రెడ్డి నిర్మించారు. డిసెంబర్ 25న సినిమా విడుదల కాబోతోంది. మంగళవారం ఆది పుట్టినరోజు. ఈ నేపథ్యంలో ‘శంబాల’ చిత్ర విశేషాల గురించి ఆది మాట్లాడుతూ ‘‘శంబాల’ అనేది ఉందా.. లేదా? అనేది ఎవ్వరికీ తెలీదు. మన పురాణాల ప్రకారం శంబాలకి ఓ మంచి గుర్తింపు ఉంది. అందుకే ఈ టైటిల్ చెప్పగానే చాలా ఎగ్జైట్ అయ్యా. దుల్కర్, ప్రభాస్‌‌, నాని గార్లు విడుదల చేసిన టీజర్‌‌‌‌, ట్రైలర్‌‌‌‌లకు మంచి రెస్పాన్స్‌‌ వచ్చింది. 

ప్రేక్షకుల్లో మా సినిమా పట్ల పాజిటివ్ బజ్ ఏర్పడింది. ఈసారి కచ్చితంగా హిట్ కొట్టబోతున్నామనే కాన్ఫిడెన్స్‌‌ వచ్చింది.  ఇందులో అన్ని పాత్రలు బాగుంటాయి. అర్చన కారెక్టర్ నాతోనే ప్రయాణం చేస్తుంటుంది. ఆమె పాత్ర అందరినీ ఆకట్టుకుంటుంది. ఎయిటీస్‌‌ బ్యాక్‌‌డ్రాప్‌‌ కావడంతో లుక్స్ విషయంలో కేర్ తీసుకున్నాం. రాజ్ కుమార్ మాస్టర్ అద్భుతమైన యాక్షన్ సీన్స్‌‌ కంపోజ్ చేశారు.  క్లైమాక్స్‌‌లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్‌‌ అదిరిపోతుంది. 

ఆ సీన్స్‌‌ అన్నీ నైట్ షూట్‌‌ చేశాం.  ఫైర్‌‌ సీక్వెన్స్ చేస్తున్నప్పుడు చిన్నగా గాయమైంది. ఇక దర్శకుడు యుగంధర్‌‌కి సినిమా పట్ల చాలా ప్యాషన్ ఉంది.  చెప్పిన కథను అద్భుతంగా తెరపై చూపించారు. ఆయన పెద్ద డైరెక్టర్ అవుతారు. ఇందులో ఎక్కువ వీఎఫ్‌‌ఎక్స్‌‌ షాట్స్‌‌ ఉండవు.. కానీ ఉన్నవి మాత్రం చాలా జాగ్రత్తగా చేసుకున్నాం. శ్రీ చరణ్ పాకాల ఆర్ఆర్ చూసి షాక్ అయ్యాం.  ప్రతీ ఒక్క పాత్రకి అద్భుతమైన థీమ్ సెట్ చేశారు. 

నిర్మాతలు కంటెంట్‌‌పై నమ్మకంతో నా మార్కెట్ కంటే ఎక్కువగానే ఖర్చు పెట్టారు. ప్రమోషన్స్ కూడా భారీ ఎత్తున నిర్వహించారు. హిందీలోనూ రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం.  ఇక ప్రస్తుతం ఈటీవీ విన్‌‌ కోసం ‘సబ్ ఇన్ స్పెక్టర్ యుగంధర్’ చేశాను. చాలా బాగా వచ్చింది. త్వరలో రిలీజ్ అవుతుంది’ అని చెప్పాడు.