
ఏఏఐ కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైడ్ కంపెనీ(ఏఏఐ సీఎల్ఏఎస్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ జులై 07.
పోస్టుల సంఖ్య: 166 అసిస్టెంట్(సెక్యూరిటీ) పాట్నా 23, విజయవాడ 24, వడోదర 09, పోర్ట్ బ్లెయిర్ 03, గోవా 53, చెన్నై 54.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుంచి 12వ తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. జనరల్ అభ్యర్థులు 60 శాతం, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 55 శాతం మార్కులు పొంది ఉండాలి.
వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 27 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
లాస్ట్ డేట్: జులై 07.
అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. పూర్తి వివరాలకు aaiclas.aero వెబ్సైట్లో చూడగలరు.