అస్సాం వరద బాధితులకు అండగా నిలిచిన ఆమీర్ ఖాన్

అస్సాం వరద బాధితులకు అండగా నిలిచిన ఆమీర్ ఖాన్

బాలీవుడ్ చాక్లెట్ బాయ్ గా పిలుచుకునే ఆమీర్ ఖాన్... చూడడానికి చాలా సింపుల్ గా కనిపిస్తూ.. తన పనులు తాను చేసుకుంటూ పోతూ ఉంటారు. అయితే తాజాగా ఆయన వార్తల్లోకి వచ్చారు. బతుకు భారమై... సతమతమవుతున్న వరద బాధితులకు అండగా నిలిచేందుకు ఆమీర్ ఖాన్ పూనుకున్నాడు. ఇటీవల అస్సాంలో కురిసిన వర్షాలకు వేలాది మంది నిరాశ్రయులైన సంగతి తెలిసిందే. మరెంతో మంది ప్రాణాలు కూడా కోల్పోయాయి. వరదల తాకిడికి రహదారులు తెగిపోయి.. పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. ఈ నేపథ్యంలో భారీ వరదలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న అస్సాం ప్రజలకు సాయమందించేందుకు ముందుకు వచ్చిన నటుడు ఆమీర్ ఖాన్ మానవత్వం చాటుకున్నాడు. తన వంతుగా రూ.25 లక్షల ఆర్థిక సాయాన్ని అస్సాం సీఎం రిలీఫ్ ఫండ్ కు అందజేశారు. ఈ విషయంపై స్పందించిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఆమీర్ ని ప్రశంసించారు. ఇకపోతే ఆమిర్ ఇటీవల నటించిన 'లాల్ సింగ్ చద్దా' ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. అయితే ఈ చిత్రంలో టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య, కరీనా కపూర్ ముఖ్య పాత్రలను పోషించిన విషయం తెలిసిందే.