ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపు దిశగా దూసుకుపోతోంది. ఎన్నికల్లో స్పష్టమైన ఆధిక్యం రావడంతో ఆప్ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆప్ కన్వీనర్, సీఎం అరవింద్ కేజ్రీవాల్ కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. సంబరాలు చేసుకునే సమయంలో బాణాసంచా కాల్చవద్దని వారిని కోరారు. ఢిల్లీలో కాలుష్యాన్ని నివారించడం కోసం బాణాసంచా కాల్చవద్దన్నారు కేజ్రీవాల్.
