
న్యూఢిల్లీ: ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్‌పై సీబీఐ కేసు నేపథ్యంలో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్‌ను మూసేయాలని సుప్రీంకోర్టును ఆప్ కోరింది. ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ పవన్ కార్తీ మద్యం వ్యాపారి అమన్ దీప్దాల్ నుంచి రూ.5 కోట్ల లంచం తీసుకున్నారన్న ఆరోపణలపై సీబీఐ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసింది. ఈ సందర్భంగా ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్‌సింగ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎక్సైజ్ స్కామ్దర్యాప్తు పేరుతో ఈడీ దోచుకుంటోందని ఆరోపించారు. సుప్రీంకోర్టు వెంటనే ఈడీని మూసేయాలని, లంచం షేర్‌పై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.