కేజ్రీవాల్ ను అరెస్ట్ చేస్తారా.? ఇంటి ముందు భారీగా పోలీసులు

కేజ్రీవాల్ ను అరెస్ట్ చేస్తారా.? ఇంటి ముందు భారీగా పోలీసులు

లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఇవాళ ఈడీ అరెస్ట్  చేసే అవకాశముందని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు.  కేజ్రీవాల్ ఇంట్లో ఈడీ సోదాలు చేసిన తర్వాత అరెస్ట్ చేసే అవకాశముందని చెబుతున్నారు.  ఇప్పటికే కేజ్రీవాల్ ఇంటికి వెళ్లే రోడ్డును బ్లాక్ చేశారు. పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. 

జనవరి 4న సీఎం కేజ్రీవాల్ నివాసంలోఈడీ సోదాలు చేసిన తర్వాత అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేసే అవకాశం ఉందని తమకు పక్కా సమాచారం ఉందని ఆప్ మంత్రి అతిషి జనవరి 3  రాత్రి తన ట్విట్టర్లో తెలిపారు. మరో మంత్రి సౌరబ్ భరద్వాజ్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. 

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఇప్పటికే ఈడీ మూడు సార్లు కేజ్రీవాల్ కు నోటీసులు జారీ చేసింది. అయితే కేజ్రీవాల్ ఈడీ విచారణకు హాజరుకాలేదు. జనవరి3న కేజ్రీవాల్ ఈడీ విచారణకు హాజరుకావాల్సి ఉంది.  అయితే కేజ్రీవాల్ ఈడీ విచారణకు హాజరుకాలేరని..ఆయనకు నోటీసులివ్వడం చట్ట విరుద్ధమని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు.