ప్రదీప్ కుటుంబానికి పరిహారం ఇవ్వాలె: ఆమ్ ఆద్మీ పార్టీ

ప్రదీప్ కుటుంబానికి పరిహారం ఇవ్వాలె: ఆమ్ ఆద్మీ పార్టీ

ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న జీహెచ్ఎంసీ అధికారులపై ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర నాయకులు మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు చేశారు. నగరంలో వీధికుక్కల బెడదతో రోడ్లపై తిరగాలంటేనే భయపడేలా చేస్తున్నాయని కమిషన్ కు తెలిపారు. వీధికుక్కల బెడద నియంత్రణలో జీహెచ్ఎంసీ అధికారులు ఫుర్తిగా విఫలమయ్యారని, వీధికుక్కల కట్టడికి తక్షణమే చర్యలు తీసుకొని అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని HRC కోరారు.

ఇటీవలే కుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారి ప్రదీప్ కుటుంబానికి 20 లక్షల పరిహారం, డబల్ బెడ్ రూమ్ ఇళ్లు, ప్రభుత్వ ఉద్యోగం కల్పించేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని  ఆమ్ ఆద్మీ పార్టీ  తెలంగాణ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు మానవ హక్కుల కమిషన్ కు విజ్ఞప్తి చేశారు.