ఫేక్​ ఐటీ కంపెనీలకు అడ్డుకట్ట వేయాలి: డాక్టర్ దిడ్డి సుధాకర్

ఫేక్​ ఐటీ కంపెనీలకు అడ్డుకట్ట వేయాలి: డాక్టర్ దిడ్డి సుధాకర్

ముషీరాబాద్, వెలుగు: నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న ఫేక్​ఐటీ కంపెనీలు, జాబ్​కన్సల్టెన్సీలకు అడ్డుకట్ట వేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ కోరారు. స్కిల్ హబ్ వంటి నకిలీ ఐటీ జాబ్ కన్సల్టెన్సీలను మూసివేయాలని, బోర్డు తిప్పేసిన ప్యూరోపాల్ క్రియేషన్స్ ఐటీ సొల్యూషన్స్ కంపెనీ బాధిత నిరుద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్​చేశారు. ప్యూరోపాల్ బాధితులతో శనివారం ఆప్​ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ధర్నా చేపట్టారు. 

గచ్చిబౌలిలోని స్కిల్ హబ్ కన్సల్టెన్సీ, ప్యూరోపాల్ ఐటీ సోలుషన్స్ వంటి ఫేక్​సంస్థలు ఉద్యోగాల పేరుతో రూ.2 లక్షలు వసూలు చేసి, చివరికి బోర్డు తిప్పేశాయన్నారు. 200 మంది రోడ్డున పడ్డారన్నారు. నకిలీ రాకెట్లను అరికట్టేందుకు ప్రత్యేక స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.