కేజ్రీవాల్​ను ఈడీ అరెస్ట్​ చేస్తది: ఆప్ నేతల ఆరోపణ

కేజ్రీవాల్​ను ఈడీ అరెస్ట్​ చేస్తది: ఆప్ నేతల ఆరోపణ
  • ఆప్ ​ముఖ్యనేతల సంచలన ఆరోపణ
  • తమను ఓడించలేక బీజేపీ ఈ పని చేస్తోందని విమర్శలు

న్యూఢిల్లీ: ఆప్​అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్​ను నవంబర్​2న ఈడీ అరెస్ట్​ చేసే అవకాశం ఉందని ఈ పార్టీ ముఖ్యనేతలు సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీ లిక్కర్​స్కామ్​కేసులో మనీలాండరింగ్​చట్టం కింద విచారణకు రావాలని సోమవారం ఈడీ కేజ్రీవాల్​కు నోటీసులు ఇచ్చింది. స్టేట్​మెంట్​రికార్డు చేస్తామని విచారణకు పిలిచి కేజ్రీవాల్ ను అరెస్ట్​చేసే అవకాశం ఉందని ఆప్​సందేహం వ్యక్తం చేస్తోంది.

ఈ మేరకు మంగళవారం ఆ పార్టీ ముఖ్యనేతలు, మంత్రి అతిషి, సౌరభ్​భరద్వాజ్ మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో ఓడించలేమని తెలిసే.. టాప్​లీడర్లను జైలుకు పంపండం ద్వారా ఆమ్​ఆద్మీ పార్టీని పూర్తిగా దెబ్బతిసేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తోందని అన్నారు. నవంబర్​2న కేజ్రీవాల్​ను అరెస్ట్​చేస్తే.. అవినీతి అభియోగాల కింద కాదని, బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడినందుకేనని తేలిపోతుందన్నారు. ‘ఆప్ రెండుసార్లు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో, మున్సిపల్​ఎన్నికల్లో బీజేపీని ఓడించింది. కేజ్రీవాల్‌‌‌‌ను చూసి మోదీ భయపడుతున్నారు. ఎన్నికల్లో ఆప్‌‌‌‌ను ఓడించలేమని తెలిసి అరెస్టుల ద్వారా పార్టీని అంతం చేయాలని బీజేపీ భావిస్తున్నది” అని అతిషి ఆరోపించారు.

దేశంలో బీజేపీ రాజకీయంగా ఓడించలేని నేతలను దర్యాప్తు సంస్థల ద్వారా టార్గెట్​చేస్తుందని విమర్శించారు. ఆప్ నేతలకు జైలుకు వెళ్లడానికి భయం లేదని, తమ చివరి శ్వాస వరకు రాజ్యాంగాన్ని కాపాడేందుకు పోరాడుతూనే ఉంటారని అతిషి చెప్పారు. సౌరభ్​భరద్వాజ్​మాట్లాడుతూ.. ‘బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీని అణిచివేసేందుకు ప్రయత్నించినప్పుడల్లా, అది మరింత బలంగా మారుతుంది.   ఆప్ తన కోసం పని చేయడం లేదు, సామాన్యుల కోసం పని చేస్తోంది’’ అని ఆయన అన్నారు.