దునియాలో పెద్ద పార్టీ.. ఓ చిన్న పార్టీకి జంకుతోంది

దునియాలో పెద్ద పార్టీ.. ఓ చిన్న పార్టీకి జంకుతోంది

న్యూఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ సర్కారుపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విమర్శలకు దిగారు. ఢిల్లీలో షెడ్యూల్ ప్రకారం నిర్వహించాల్సిన మున్సిపల్ ఎన్నికల (ఎంసీడీ)ను మోడీ ప్రభుత్వం కావాలనే వాయిదా వేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఎంసీడీ పోల్స్ వాయిదా వేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ పై బీజేపీ సర్కారు ఒత్తిడి తీసుకొస్తోందని ఫైర్ అయ్యారు. ‘ఎలక్షన్ ను కొన్ని నెలల పాటు పోస్ట్ పోన్ చేసేందుకు సవరణ  చట్టం తీసుకొస్తున్నారు. చిన్నపాటి ఎన్నికల్లో గెలిచేందుకు వ్యవస్థలతో ఆడుకోవడం సరికాదు. ఇది ఆమోదయోగ్యం కాదు. ఎంసీడీ ఎన్నికల్లో బీజేపీ తుడిచిపెట్టుకుపోతుందని అందరికీ తెలుసు. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ అని చెప్పుకునే బీజేపీ.. ఢిల్లీలోని ఓ చిన్న పార్టీకి, చిన్న ఎలక్షన్ కు భయపడుతోంది. బీజేపీ నేతలకు దమ్ముంటే ఈ ఎన్నికలను షెడ్యూల్ ప్రకారం నిర్వహించి, అందులో గెలిచి చూపించాలి. ఒకవేళ ఎలక్షన్స్ లో ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోతే మేం రాజకీయాల నుంచి తప్పుకుంటాం’ అని కేజ్రీవాల్ సవాల్ విసిరారు. 

మరిన్ని వార్తల కోసం:

జైలులో వికీలీక్స్ ఫౌండర్ అసాంజే వివాహం

యూపీలో దారుణం.. చాక్లెట్లు తిని చిన్నారుల మృతి

వైరల్ వీడియో: మురికి కాలువను క్లీన్ చేసిన కౌన్సిలర్