వైరల్ వీడియో: మురికి కాలువను క్లీన్ చేసిన కౌన్సిలర్

వైరల్ వీడియో: మురికి కాలువను క్లీన్ చేసిన కౌన్సిలర్

న్యూఢిల్లీ: ‘ఒకే ఒక్కడు’ మూవీలో రౌడీ గ్యాంగ్ తో బురదలో ఫైట్ చేసిన హీరోకు ప్రజలు పాలాభిషేకం చేస్తారు. ఒక్కరోజు ముఖ్యమంత్రిగా పలు సంచలన నిర్ణయాలు తీసుకున్న హీరో పనితీరుకు మెచ్చి పాలాభిషేకం చేసే ఆ సీన్ ప్రేక్షకుల హృదయాలకు హత్తుకుంది. అదే తరహాలో సింహాద్రి సినిమాలోనూ విలన్ ను చంపిన తర్వాత హీరోకు పాలాభిషేకం చేసే సీన్ గుర్తుండే ఉంటుంది. అచ్చంగా.. అలాంటిదే ఢిల్లీలోనూ జరిగింది. మురికి కాలువను శుభ్రం చేసేందుకు అందులోకి దూకిన ఆప్ కౌన్సిలర్ కు.. ఆ తర్వాత పాలాభిషేకం చేశారు. తూర్పు ఢిల్లీకి చెందిన హసీబ్ ఉల్ హసన్ అనే ఆప్ కౌన్సిలర్.. శాస్త్రి పార్క్‌లో పొంగిపొర్లుతున్న మురుగు కాలువను శుభ్రం చేయడానికి దూకాడు. స్థానికంగా టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఆ కాలువను అక్కడి అధికారులు శుభ్రం చేయడం లేదని.. అందుకే తానే స్వయంగా రంగంలోకి దిగానని హసీబ్ చెప్పడం గమనార్హం. కాలువలో నుంచి బయటకు వచ్చిన తర్వాత హసీబ్ కు ఆయన మద్దతుదారులు పాలతో అభిషేకం చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్ లో వైరల్ గా మారాయి.  

మరిన్ని వార్తల కోసం:

‘అటాక్’కు రెడీ అంటున్న యాక్షన్ హీరో

యాష్లే బార్టీ షాకింగ్ నిర్ణయం

రెండో రోజు పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలు