‘అటాక్’కు రెడీ అంటున్న యాక్షన్ హీరో

‘అటాక్’కు రెడీ అంటున్న యాక్షన్ హీరో

ముంబై: యాక్షన్ హీరోగా బాలీవుడ్ లో క్రేజ్ తెచ్చుకున్న జాన్ అబ్రహాం నటిస్తున్న కొత్త మూవీ ‘అటాక్’. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా పార్ట్ 1కి సంబంధించి రెండో ట్రైలర్ రీసెంట్ గా రిలీజైంది. ప్రయోగాత్మకంగా తీస్తున్న ఈ మూవీలో జాన్ సూపర్ హ్యూమన్ సోల్జర్ గా కనిపిస్తున్నాడు. భారతీయ సినిమాల్లో ఇలాంటి నేపథ్యంతో వస్తున్న తొలి సినిమాగా దీన్ని చెబుతున్నారు. టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను వాడుతూ భవిష్యత్ లో యుద్ధాలు జరుగుతాయని చెప్పడమే ‘అటాక్’ కాన్సెప్ట్ అని అర్థమవుతోంది. ట్రైలర్ లో ఏఐ సాయంతో జాన్ అబ్రహాం చేసిన డేంజరస్ స్టంట్స్ సినిమాపై ఆసక్తిని రేపుతోంది. అతడ్ని సూపర్ సోల్జర్ గా చూపిస్తూ ట్రైలర్ సాగింది. దీన్ని బట్టి మూవీ మొత్తం యాక్షన్ ప్యాక్డ్ గా ఉంటుందని చెప్పొచ్చు. ఇకపోతే అటాక్ మూవీ కథ జాన్ అబ్రహాంకు వచ్చిందేనట. జాన్ ఐడియాను సుమిత్ బతేజా, విశాల్ కపూర్ లు పూర్తి కథగా సిద్ధం చేశారట. రకుల్ ప్రీత్ సింగ్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, ప్రకాశ్ రాజ్ లాంటి స్టార్లు నటిస్తున్న ఈ మూవీని ఏప్రిల్ 1న విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. 

మరిన్ని వార్తల కోసం:

యాష్లే బార్టీ షాకింగ్ నిర్ణయం

రెండో రోజు పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలు

చక్కెర కోసం కొట్లాట