చక్కెర కోసం కొట్లాట

చక్కెర కోసం కొట్లాట

వైరల్​గా మారిన రష్యా వీడియో

మాస్కో: సూపర్​ మార్కెట్లలో షుగర్​ కోసం రష్యన్లు కొట్టుకున్న వీడియోలు సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి. ఉక్రెయిన్​తో వార్​ కారణంగా రష్యాలోని చాలా స్టోర్లు ఒక్కో కస్టమర్​కు 10 కేజీల షుగర్​ లిమిట్​ పెట్టాయి. దేశంలో ద్రవ్యోల్బణం పెరిగిపోయి షుగర్​ రేట్లు కూడా ఆకాశాన్నంటాయి. దీంతో కొన్ని స్టోర్లలో షుగర్​ బ్యాగులను కార్ట్​ల్లో వేసుకుని తీసుకెళ్లేందుకు కొందరు.. వారి నుంచి బ్యాగులను లాక్కునేందుకు మిగతా వారు ప్రయత్నించారు. ఈ క్రమంలో చాలా చోట్ల గొడవలు జరుగుతున్నాయి. వీటికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్​అయ్యాయి. రష్యా, ఉక్రెయిన్​ వార్​ కారణంగా రష్యన్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఇవి కళ్లకు కడుతున్నాయి. రష్యన్​ అధికారులు మాత్రం షుగర్​కు ఎలాంటి కొరతా లేదని, కస్టమర్ల భయాందోళన కారణంగానే ఈ సంక్షోభ పరిస్థితులు తలెత్తుతున్నాయని చెబుతున్నారు.