జైలులో వికీలీక్స్ ఫౌండర్ అసాంజే వివాహం

జైలులో వికీలీక్స్ ఫౌండర్ అసాంజే వివాహం

లండన్: వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజే తన పార్ట్నర్ స్టెల్లా మోరిస్‌ను పెళ్లి చేసుకోనున్నారు. బుధవారం లండన్‌లోని హై–సెక్యూరిటీ జైలులో వీరు వివాహం చేసుకోనున్నారు. జైలులో నలుగురు అతిథులు, ఇద్దరు అధికారిక సాక్షులతోపాటు ఇద్దరు సెక్యూరిటీ గార్డుల మధ్య ఈ వేడుక జరగనుంది. ఇకపోతే, అసాంజే వికీలీక్స్ యూఎస్ మిలిటరీ రికార్డులు, దౌత్య అంశాల విడుదలకు సంబంధించి విచారణను ఎదుర్కొంటున్నారు. 50 ఏళ్ల అసాంజే 2019 నుంచి బెల్మార్ష్ జైలులో ఉన్నారు. దీనికి ముందు లండన్‌లోని ఈక్వెడార్ రాయబార కార్యాలయంలో 7 సంవత్సరాలు ఉన్నారు. రాయబార కార్యాలయంలో నివసిస్తున్న సమయంలోనే అసాంజే తన న్యాయవాది మోరిస్‌తో కలసి ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. 2011లో తన న్యాయ బృందంలో పని చేస్తున్నప్పుడు మోరిస్ ను కలిశారు. 2015 నుంచి వాళ్లిద్దరూ రిలేషన్ లో ఉన్నారు. 

మరిన్ని వార్తల కోసం:

వైరల్ వీడియో: మురికి కాలువను క్లీన్ చేసిన కౌన్సిలర్

‘అటాక్’కు రెడీ అంటున్న యాక్షన్ హీరో

యాష్లే బార్టీ షాకింగ్ నిర్ణయం