మున్సిపాలిటీల అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. చెన్నూరు మున్సిపాలిటీలో మార్నింగ్ వాక్ లో భాగంగా మున్సిపాలిటీలో పలు వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీ తో గెలిపించాలని కోరారు మంత్రి.
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఓటర్లకు వివరించి పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో వార్డు అభ్యర్థులు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.
ఫిబ్రవరి 11న మున్సిపల్ ఎన్నికలు జరగనుండగా..13న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ క్రమంలో అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఇవాళ నామినేషన్ల విత్ డ్రాకు చివరి తేది కావడంతో ఎన్నికల ప్రచారం మరింత స్పీడ్ కానుంది.
