తొర్రూరు, వెలుగు : మున్సిపాలిటీ ఎన్నికల్లో తొర్రూరులో కాంగ్రెస్ పార్టీ అన్నివార్డులను క్లిన్స్విప్ చేయాలని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీరెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం పట్టణంలోని పలు వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులతో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు.
కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులను గెలిపించి పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసుకునేందుకు సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా పలువురు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరగా, ఝాన్సీరెడ్డి కాంగ్రెస్ కండువాలు కప్పి ఆహ్వానించారు. అంతకుముందు పట్టణంలోని క్యాంప్ ఆఫీస్లో 16 వార్డుల కాంగ్రెస్ అభ్యర్థులకు బీ ఫారాలను అందజేశారు.
