మహిళా క్రికెట్ పోటీల్లో వరంగల్ జట్టు శుభారంభం

మహిళా క్రికెట్ పోటీల్లో వరంగల్ జట్టు శుభారంభం

ధర్మసాగర్, వెలుగు: వరంగల్ వేదికగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 2 నుంచి 7 వరకు జరుగుతున్న అంతర్ జిల్లా మహిళా టీ 20 క్రికెట్ పోటీల్లో వరంగల్ జట్టు మెదక్ జట్టుపై 56 పరుగుల తేడాతో విజయం సాధించింది. సోమవారం కరుణాపురం సమీపంలోని వంగాలపల్లి వరంగల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్  క్రికెట్ మైదానంలో జరిగిన తొలి మ్యాచులో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన వరంగల్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది.

114 పరుగుల లక్షంతో బరిలోకి దిగిన మెదక్ జట్టు కేవలం 12.4 ఓవర్లలో 57 పరుగులకి ఆల్ ఔట్ కావడంతో 56 పరుగులు తేడాతో ఓడింది. వరంగల్ లోని మొగిలిచర్ల గ్రౌండ్ లో జరిగిన మరో మ్యాచులో నిజామాబాద్ జట్టుపై ఖమ్మం జట్టు 10 వికెట్ల తేడాతో గెలుపొందింది.